దెబ్బకు దెబ్బ తీస్తాం: నరేన్

KDP: జడ్పీటీసీ ఉప ఎన్నికల సందర్భంగా పులివెందులలో టీడీపీ నాయకులు వైసీపీ ఏజెంట్లు, ఓటర్లపై దౌర్జన్యంగా ప్రవర్తించారని ఆ పార్టీ కమలాపురం ఇంఛార్జ్ నరేన్ రెడ్డి అన్నారు. ఆ తీరుకు తగిన ప్రతిస్పందన ఉంటుందని హెచ్చరించారు. టీడీపీ ఓటమి భయంతోనే అల్లర్లకు తెగబడిందని ఆరోపించారు. దాడులకు పాల్పడి ఎవరు నవ్వుకుంటున్నారో వారి పరిస్థితి రేపు ఏడ్చే లాగా ఉంటుందన్నారు.