ఎమ్మెల్యేతో చెర్లోపల్లి ఖండం రైతుల భేటీ

AKP: అనకాపల్లి జనసేన కార్యాలయంలో చెర్లోపల్లి ఖండం రైతులు ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణతో ఆదివారం భేటీ అయ్యారు. ఈ సమస్య పరిష్కారానికి చొరవ తీసుకున్న ఎమ్మెల్యేకు రైతులు కృతజ్ఞతలు తెలిపారు. సమస్య పరిష్కారం కాకపోవడంతో ల్యాండ్ పూలింగ్కు భూములు ఇచ్చి ఇబ్బందులు పడ్డామన్నారు. త్వరలో అభివృద్ధి పనులు చేపట్టేందుకు అధికారులతో మాట్లాడి చర్యలు తీసుకుంటామని తెలిపారు.