KCR సభ.. వేడెక్కుతున్న రాజకీయం..!
JGL: జిల్లాలో రాజకీయ వాతావరణం మరింత ఉద్రిక్తంగా మారింది. కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభ నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను, ప్రస్తుత ఎమ్మెల్యే సంజయ్ వర్గానికి చెందిన కార్యకర్తలు చింపివేయడం స్థానికంగా ఉద్రిక్తతలకు దారితీసింది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు.