'మత్స్యకారులు సముద్ర వేటకు వెళ్ళవద్దు'

'మత్స్యకారులు సముద్ర వేటకు వెళ్ళవద్దు'

కోనసీమ: జిల్లాలోని సముద్ర తీర ప్రాంతంలో మత్స్యకారులు వేటకు వెళ్ళవద్దని కలెక్టర్ మహేష్ కుమార్ సూచించారు. బంగాళాఖాతంలో తీవ్ర వాతావరణ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉన్న నేపథ్యంలో వాతావరణ శాఖ హెచ్చరికల కారణంగా ఆయన కలెక్టరేట్ నుంచి మీడియాకు ప్రకటన విడుదల చేశారు. సముద్రంలో ఉన్నవారు ఈనెల 21 లోపు తీరానికి రావాలని సూచించారు.