రైలు నుంచి కిందపడి ఒకరు మృతి

ADB: కదులుతున్న రైలులో నుంచి ఓ గుర్తు తెలియని వ్యక్తి ప్రమాదవశాత్తు జారి కిందపడి మృతి చెందిన ఘటన నిర్మల్ జిల్లా బాసర రైల్వే స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లి పరిశీలించారు. మృతుడు నీలం రంగు గీతల షర్ట్,లుంగీ ధరించి ఉన్నాడు. ఆచూకీ తెలిసిన వారు 8712658591ను సంప్రదించాలని బాసర రైల్వే HC మహబూబ్ కోరారు.