'వేలిముద్ర నిబంధన తొలగించాలి'
ADB: మార్కెట్ యార్డ్‌లో సోయా పంట కొనుగోళ్లలో వేలిముద్ర నిబంధనలు తొలగించాలని మాజీ మంత్రి జోగు రామన్న అన్నారు. రైతులకు, రైతు కుటుంబాలకు సౌకర్యంగా ఉన్నటువంటి ఓటీపీ విధానాన్ని వర్తింపజేయాలని తెలిపారు. బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో ఇవాళ మీడియాతో ఆయన మాట్లాడుతూ.. పత్తి కొనుగోళ్ల విధంగానే సోయాలను OTP విధానం ద్వారా కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.