విద్యార్థుల ఆరోగ్యం పట్ల శ్రద్ద వహించాలి: జాయింట్ కలెక్టర్
PPM: గిరిజన సంక్షేమ వసతి గృహాలు, ఆశ్రమ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ద వహించాలని జేసీ సి. యశ్వంత్ కుమార్ రెడ్ది సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆయన ఛాంబరులో విద్యార్థులు ఆరోగ్యంపై సమీక్షించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. వసతి గృహాలు, ఆశ్రమ పాఠశాల విద్యార్థులకు ఎటువంటి అనారోగ్య సమస్యలు లేకుండా చూడాలన్నారు.