పురుగుల మందు తాగి మహిళ ఆత్మహత్య
KMM: మురుగుల మందు తాగి ఓ మహిళ ఆత్మహత్య చేసుకున్న ఘటన కామేపల్లి(M) బర్లగూడెంలో చోటుచేసుకుంది. బానోతు కనిక(56), సంతు అనే ఇద్దరు దంపతులు కూలీ పనులు చేసుకుంటూ జీవిస్తున్నారు. వీరికి రోజు రాత్రి మద్యం తాగే అలవాటు ఉంది. కాగా, మద్యం తాగిన గొడవ పడ్డారు. దీంతో మనస్తాపంతో కనిక పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనపై ఆమె కుమారుడు కుమార్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.