జీవితం ఎంతో విలువైనది.. యువతకు డీసీపీ సూచన
HYD: జీవితం ఎంతో విలువైనదని, ఆత్మహత్యలకు పాల్పడకూడదని ఖైరతాబాద్ జోన్ డీసీపీ శిల్పవల్లి తెలిపారు. జీవితంలో తాత్కాలికంగా వచ్చే ఇబ్బందుల కారణంగా, తప్పుడు నిర్ణయాలు తీసుకోకూడదని ఆమె యువతకు సూచించారు. మనం చేసే ఒక తప్పిదంవల్ల కుటుంబానికి అపారమైన బాధ కలిగిస్తుందని పేర్కొన్నారు. సమస్యలు ఎదురైనప్పుడు కుటుంబ పెద్దల సహాయం తీసుకుని ధైర్యంగా ఉండాలన్నారు.