నడిగూడెం వాసుల్ని వెంటాడుతున్న వాగు భయం

SRPT: నడిగూడెం గ్రామంలో వర్షాలు పడితేనే వాగు ఉధృతి కారణంగా ప్రధాన రహదారి మూసుకుపోతుంది. బస్టాండ్ వద్ద ఉన్న చెరువు అలుగు వాగులో కలిసిపోతూ, ఎస్సీ, బీసీ కాలనీల్లోకి వరదనీరు ప్రవేశిస్తోంది. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కల్వర్టుల కొరత, మిగిలిన వాటి తగిన నిర్వహణ లేకపోవడం వల్ల ప్రమాదాలు పెరిగిపోతున్నాయి. చిన్నారుల భద్రతపై ఆందోళన వ్యక్తమవుతోంది.