రాష్ట్ర స్థాయిలో ఆదిలాబాద్ 'షీ టీమ్' రికార్డు

రాష్ట్ర స్థాయిలో ఆదిలాబాద్ 'షీ టీమ్' రికార్డు

ADB: తెలంగాణ రాష్ట్ర స్థాయిలో మహిళలు, చిన్నారుల రక్షణలో విశేష ప్రతిభ కనబరిచిన ఆదిలాబాద్ షీ టీమ్ ఏప్రిల్ రాష్ట్రస్థాయి సమీక్షలో రెండో స్థానం, క్లస్టర్-IVలో ప్రథమ స్థానం సాధించింది. 65 ఫిర్యాదులపై 49 కేసులు నమోదు చేసి, 52 మందిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. 49 అవగాహన సదస్సులతో బాల్యవివాహాల నివారణలో కీలక పాత్ర పోషించారని ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు.