పిడుగుపాటుకు రెండు ఆవులు మృతి

పిడుగుపాటుకు రెండు ఆవులు మృతి

మన్యం: వీరఘట్టం మండల కేంద్రంలో బంగ్లా సమీపంలో నివాసం ఉంటున్న రైతు లెంక మురళికి చెందిన రెండు ఆవులు పిడుగు పడి మృతి చెందాయి. గురువారం రాత్రి భారీ వర్షంతో పాటు పెద్ద ఎత్తున పిడుగులు పడ్డాయి. శుక్రవారం తెల్లవారుజామున పశువులకు మేత వేసేందుకు వెళ్లిన రైతు ఆవులు మృతి చెందినట్లు గుర్తించాడు.