VIDEO: హయత్‌నగర్ కుంట్లూరులో హైడ్రా కూల్చివేతలు
RR: జిల్లా హయత్‌నగర్ కుంట్లూరులో రోడ్ల ఆక్రమణలను హైడ్రా అధికారులు నేలమట్టం చేశారు. సర్వే నెంబర్ 204లోని 5 ఎకరాల భూమిలో వెంచర్ రోడ్డులో అక్రమ నిర్మాణాలపై హైడ్రా ఉక్కుపాదం మోపింది. 40 ఫీట్ల రోడ్లకు అడ్డంగా ఐరన్ షీట్లు ఏర్పాటు చేసి కబ్జా చేశారు. స్థానికుల ఫిర్యాదుతో ఐరన్ షీట్లు తొలగించారు. కూల్చివేతల సమయంలో ఫ్లాట్ల యజమానులకు, వెంచర్ యజమారులకు వాగ్వాదం చోటుచేసుకుంది.