బ్లూ టంగ్ వ్యాక్సిన్‌ను పరిశీలించిన కలెక్టర్

WGL: జంతు ఆరోగ్య రక్షణ చర్యల్లో భాగంగా గొర్రెలు, మేకలకు బ్లూ టంగ్ వ్యాధి నివారణ మందు వేస్తున్న కార్యక్రమాన్ని కలెక్టర్ సత్య శారద పరిశీలించారు. పశువైద్య శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ టీకా కార్యక్రమాన్ని ఆమె ప్రత్యక్షంగా తనిఖీ చేసి, తగిన సూచనలు ఇచ్చారు. గొర్రెలు, మేకల్లో బ్లూ టంగ్ వ్యాధి వ్యాప్తి చెందకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని తెలిపారు.