VIDEO: గ్యాస్ పైప్‌లైన్ వేయవద్దని రైతులు ఆందోళన

W.G: నరసాపురం మండలం రుస్తుంబాధ గ్రామంలో ఓ.ఎన్. జీ.సి.గ్యాస్ పైప్ లైన్ తమ పొలాల్లో నుండి వేయవద్దని రైతులు అడ్డుకోవడం తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులకు దారి తీసింది. తమ పొలాల్లో నుండి పైప్ లైన్ వెయ్యవద్దని గత 10 ఏళ్లుగా రైతులు అడ్డుకుంటూ వచ్చారు. ఈ నేపథ్యంలో ఓఎన్జేసీ అధికారులు, పోలీసుల సహాయం కోరడంతో రైతులను అక్కడ నుంచి తరిమి అరెస్ట్ చేశారు.