ఎస్సీ వర్గీకరణ ఫలాలు అందరికీ అందాలి

KRNL: ఎస్సీ వర్గీకరణను ఏపీలో అమలు చేసినందుకు ఎస్సీ 57 ఉపకులాల హక్కుల పోరాట సమితి వ్యవస్థాపక జాతీయ అధ్యక్షుడు బైరి వెంకటేశం సీఎం చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపారు. శుక్రవారం కర్నూలులోని ఎస్సీ 57 ఉపకులాల హక్కుల పోరాట సమితి కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. 57 ఉపకులాలు ఎస్సీ వర్గీకరణ ఫలాలను ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు.