'పెంచిన రూ.1లక్షను వెంటనే జమ చేయాలి'
ASR: పీఎం జన్ మన్ ఇళ్ల నిర్మాణాలకు పెంచిన రూ.1లక్షను వెంటనే లబ్దిదారుల ఖాతాల్లో జమ చేయాలని సీపీఎం పాడేరు మండల కార్యదర్శి చిట్టిబాబు, గిరిజన సంఘం జిల్లా కమిటీ సభ్యుడు లక్కు డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం పలువురు లబ్దిదారులతో కలిసి ఐటీడీఏ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. పలువురు లబ్దిదారుల పీఎం జన్ మన్ ఇళ్ల నిర్మాణాలు మధ్యలోనే నిలిచిపోయాయని తెలిపారు.