VIDEO: చంద్రంపేట బ్రిడ్జి పై నిలిచిపోయిన రాకపోకలు
VZM: గంట్యాడ మండలం చంద్రంపేట, చిన్న వసంత గ్రామాల మధ్య ఉన్న బ్రిడ్జిపై రాకపోకలను అధికారులు నిలిపివేశారు. ఇటీవల చిన్న వసంతకు చెందిన ఓ వ్యాపారి వాగులో కొట్టుకుపోయి మృతి చెందిన నేపథ్యంలో, ప్రమాదాలు జరగకుండా ముందస్తు జాగ్రత్తగా ఈ నిర్ణయం తీసుకున్నారు. బ్రిడ్జికి రెండు వైపులా పెద్ద చెట్లు అడ్డంగా వేసి, హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేశారు.