తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే
TPT: తిరుమల శ్రీవారిని పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఇవాళ ఉదయం దర్శించుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో ఆలయ పండితులు వేద ఆశీర్వచనం అందించారు. శ్రీవారి ఆశీస్సులతో నియోజకవర్గ ప్రజలు సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో, ఆర్థిక అభ్యున్నతి సాధించాలని కోరుకున్నట్లు ఆయన తెలిపారు.