ప్రభుత్వ ఆసుపత్రిలో క్లిష్టమైన ఆపరేషన్

ప్రభుత్వ ఆసుపత్రిలో క్లిష్టమైన ఆపరేషన్

PDPL: పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో రొంపికుంటకు చెందిన మహిళకు ఇవాళ క్లిష్టమైన ఆపరేషన్ నిర్వహించినట్లు సూపరింటెండెంట్ డా. శ్రీధర్ తెలిపారు. ఆమె కడుపు నొప్పితో ఆసుపత్రిలో చేరగా, పరీక్షలు నిర్వహించి గర్భధారణ ఫెలోపియన్ ట్యూబ్లో జరిగినట్లు వైద్యులు గుర్తించారు. అది పెరిగి పగిలిపోవడంతో అత్యంత నైపుణ్యంతో శస్త్ర చికిత్స నిర్వహించి ప్రాణాలు కాపాడినట్లు తెలిపారు.