మిత్రుని కుటుంబానికి ఆర్థిక సాయం అందజేత
BHNG: బీబీ నగర్ మండలం కొండమడుగుకు చెందిన కొత్తపల్లి రామారావు అనారోగ్యంతో ఇటీవల మృతి చెందాడు. మృతుని ఎస్సెస్సీ బ్యాచ్ 2002 క్లాస్‌మేట్స్ అందరూ కలసి రూ.52,000 ఆర్థిక సహాయాన్ని రామారావు కుటుంబ సభ్యులకు ఆదివారం అందజేశారు. ఈ సందర్భంగా రామారావు స్మృతిని తలచుకుంటూ మిత్రులు భావోద్వేగానికి గురయ్యారు.