15 మంది వాలంటీర్లు రాజీనామాలు

15 మంది వాలంటీర్లు రాజీనామాలు

పశ్చిమగోదావరి: ఉంగుటూరు మండలం బొమ్మిడి సచివాలయం పరిధిలో 15 మంది వాలంటీర్లు స్వచ్ఛందంగా రాజీనామాలు చేశారు. సోమవారం సచివాలయం కార్యదర్శి ఎం కొండలరావుకి రాజీనామా పత్రాలను అందజేశారు. తమ రాజీనామాల వెనుక ఎవరి ఒత్తిడి లేదని ముఖ్యమంత్రి జగన్ కు మద్దతుగా తామంతా పనిచేస్తామని వాలంటీర్లు చెప్పారు