'గంజాయి, నాటుసారా వల్ల జీవితాలు నాశనం'

'గంజాయి, నాటుసారా వల్ల జీవితాలు నాశనం'

ASR: గంజాయి రవాణా, నాటుసారా తయారీ, క్రయవిక్రయాలకు దూరంగా ఉండాలని కొయ్యూరు సీఐ బీ.శ్రీనివాసరావు, ఎస్సై పీ.కిషోర్ వర్మ ప్రజలకు సూచించారు. కొయ్యూరు మండలం చీడిపాలెంలో గురువారం రాత్రి పర్యటించారు. గ్రామస్తులతో సమావేశం నిర్వహించారు. గంజాయి, డ్రగ్స్, నాటుసారా మత్తు పదార్థాల వినియోగం వల్ల జీవితాలు నాశనం అవుతున్నాయన్నారు. అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలన్నారు.