సైనిక్ స్కూల్ పాఠశాలకు మనస్వని ఎంపిక

VZM: గజపతినగరం మండలంలోని మధుపాడ గ్రామ పరిధిలోని సాయి గౌతమ్ పాఠశాల విద్యార్థిని సైనిక్ స్కూల్లో ఆరో తరగతిలో ప్రవేశానికి ఎంపికైందని పాఠశాల కరస్పాండెంట్ ఎస్ఎస్ నాయుడు గురువారం తెలిపారు. బొండపల్లి గ్రామానికి చెందిన దాసరి మనస్విని గుజరాత్‌లోని బాలచాడి సైనిక్ స్కూల్‌లో ప్రవేశానికి ఎంపికైనట్లు చెప్పారు.