గణేశ్ మండపాల నిర్వాహకులకు సీపీ సూచనలు

SDPT: సిద్దిపేటలో గణేశ్ మండపాల నిర్వాహకులు ప్రజల భద్రత కోసం పోలీసుల సూచనలు తప్పకుండా పాటించాలని సీపీ అనురాధ మంగళవారం సూచించారు. విగ్రహాలను ట్రాఫిక్‌కు అడ్డు లేకుండా ఏర్పాటు చేసుకోవాలని, మండపాల వద్ద టపాకాయలు, ఇతర మందుగుండు సామాగ్రి ఉంచరాదని కోరారు. నాణ్యత కలిగిన వైర్తో మాత్రమే కరెంటు కనెక్షన్ ఇచ్చుకోవాలని ఆమె తెలిపారు.