నెల్లూరులో ఉరేసుకుని వ్యక్తి ఆత్మహత్య
నెల్లూరు బీఎంఆర్ నగర్‌లో విషాదం నెలకొంది. స్థానికంగా నివాసం ఉంటున్న ఖాజా(50) ఎలక్ట్రిషియన్ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో ఇంట్లో ఎవరూ లేని సమయంలో గురువారం రాత్రి ఉరి వేసుకున్నాడు. కుటుంబసభ్యులు వేదాయపాలెం పోలీసులకు సమాచారం ఇచ్చారు. అయితే, ఆర్థిక ఇబ్బందులే ఆత్మహత్యకు కారణంగా తెలుస్తోంది.