VIDEO: 'చెరువు కట్టను సుందరీ కరణంగా తీర్చిదిద్దబోతున్నాం'
NLR: వింజమూరు పట్టణంలోని నీటిపారుదల శాఖ కార్యాలయం నుంచి బంగ్లా సెంటర్ వరకు చెరువుకట్ట సుందరీకరణకు నిధులు మంజూరైనట్లు జిల్లా డ్వామా పీడీ గంగభవాని తెలిపారు. 300 మీటర్ల పొడవునా చెరువుకట్ట దిగువ ప్రాంతాన్ని రూ.50 లక్షలతో అభివృద్ధి చేయనున్నట్లు పేర్కొన్నారు. పనులపై సంబంధిత అధికారులకు దిశానిర్దేశం చేసినట్లు ఆమె చెప్పారు.