ఎమ్మెల్యే నేటి పర్యటన వివరాలు
కోనసీమ: పి.గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ నేటి పర్యటన వివరాలు ఇలా ఉన్నాయి. ఉదయం 10 గంటలకు పి.గన్నవరంలో నూతనంగా నిర్మించిన పంచాయతీ భవనాన్ని ప్రారంభించనున్నారు. ఉదయం 11 గంటలకు మామిడికుదురు మండలం ఆదుర్రులో నూతనంగా నిర్మించిన పంచాయతీ భవనాన్ని ప్రారంభిస్తారు. మధ్యాహ్నం 3 గంటలకు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ చేస్తారు అని కార్యవర్గం తెలిపింది.