VIDEO: ప్రతి రైతుకు యూరియా పంపిణీ చేస్తాం: మోహన్ నాయుడు

CTR: జీడీ నెల్లూరు మండలంలోని ప్రతి రైతుకు యూరియా పంపిణీ చేస్తున్నట్లు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం అధ్యక్షుడు మోహన్ నాయుడు పేర్కొన్నారు. నూతనంగా ఏర్పడిన పాలకమండలి శుక్రవారం స్థానిక ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయంలో రైతులకు యూరియా బస్తాలను పంపిణీ చేశారు. ఈ మేరకు 300 బస్తాల యూరియా రైతులకు అందుబాటులో ఉందని, కొరత ఉంటే మళ్లీ పంపిణీ చేస్తామన్నారు.