ఈనెల 12న జాబ్ మేళా..!

ఈనెల 12న జాబ్ మేళా..!

JGL: జిల్లాలోని నిరుద్యోగులకు ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు కల్పించడానికి ఈనెల 12న జిల్లా ఉపాధి కల్పన కార్యాలయంలో ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నామని జిల్లా ఉపాధి కల్పన అధికారి సత్యమ్మ తెలిపారు. టెన్త్ నుంచి డిగ్రీ చదివిన వారు అర్హులన్నారు. కేఎల్ గ్రూప్ సంస్థలో హైదరాబాద్‌లో పనిచేయవలసి ఉంటుందన్నారు. వేతనం రూ.16 వేలు ఉంటుందని తెలిపారు.