నూతన కరెంటు పోల్స్ ఏర్పాటు చేయించిన సర్పంచ్
NGKL: లింగోటం గ్రామంలో గత ఐదు నుంచి పది సంవత్సరాలుగా విద్యుత్ అంతరాయం, అలాగే ఇండ్లపై నుంచి వెళ్లే విద్యుత్ వైర్ల కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యను ప్రజలు సర్పంచ్ తాడెం జయప్రకాశ్ దృష్టికి తీసుకెళ్లగా ఆయన వెంటనే స్పందించి ఇవాళ కొత్త కరెంట్ పోల్స్ ఏర్పాటు చేయించారు. దీంతో గ్రామస్తులు సర్పంచ్‌కు కృతజ్ఞతలు తెలిపారు.