అయ్యవారిపల్లిలో జింక మృతి

అయ్యవారిపల్లిలో జింక మృతి

NLR: వలేటివారిపాలెం మండలంలోని అయ్యవారిపల్లి గ్రామ సమీపంలో హైవే పక్కన ఒక జింక ఆదివారం మృతి చెంది కనిపించింది. అయ్యవారిపల్లి-మాలకొండ మధ్య అటవీ ప్రాంతంలో జింక హైవే దాటుతుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొని ఉంటుందని, దానివల్ల జింక మృతి చెంది ఉంటుందని స్థానికులు భావిస్తున్నారు. ఈ ఘటనపై అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు.