ఇందిరమ్మ చీరల పంపిణీ

ఇందిరమ్మ చీరల పంపిణీ

VKB: పూడురు మండలం ఎన్కెపల్లిలో మహిళలకు ఇందిరమ్మ చీరలను మండల కాంగ్రెస్ అధ్యక్షుడు సురేందర్ ముదిరాజ్ పంపిణీ చేశారు. గ్రామ మహిళలకు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల్లో భాగంగా చీరలను అందజేస్తూ, కాంగ్రెస్ ప్రభుత్వం మహిళల సంక్షేమం పట్ల కట్టుబడి ఉందని సురేందర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ కాంగ్రెస్ నాయకులు అనంతయ్య, సత్తయ్య, ప్రవీణ్, సువాని పాల్గొన్నారు.