పరీక్షా కేంద్రం ముందు గ్రూప్-1 అభ్యర్థుల ఆందోళన

HYD: అబిడ్స్‌లోని స్టాన్లీ కాలేజీ ముందు గ్రూప్-1 అభ్యర్థులు ఆందోళనకు దిగారు. ఫోన్లు, బ్యాగులు పెట్టుకునేందుకు కాలేజీ వద్ద ఎలాంటి సదుపాయం లేదంటూ మండిపడ్డారు. బందోబస్తు చేపట్టిన పోలీసులతో, కాలేజీ సిబ్బందితో వారు వాగ్వాదానికి దిగారు. ఓ వైపు పరీక్ష సమయం కావడం, కాలేజీ వద్ద లాకర్ల సదుపాయం లేకపోవడంతో ఆందోళన చేశారు.