'రోడ్డు ప్రమాదం.. మహిళ స్పాట్ డెడ్'

కృష్ణా: బాపులపాడు మండలం అంపాపురం వద్ద చెన్నై-కలకత్తా జాతీయ రహదారిపై శుక్రవారం రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికుల వివరాల మేరకు.. రాజమండ్రి నుంచి విజయవాడ వెళ్తున్న కారు ఎదురుగా వస్తున్న ట్రాలీని ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఒక మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనపై వివరాలు సేకరిస్తున్నారు.