VIDEO: ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే
ప్రకాశం: తెలుగువారి ఆత్మ గౌరవం నుంచి టీడీపీ పార్టీ పుట్టిందని గిద్దలూరు ఎమ్మెల్యే అశోక్ రెడ్డి అన్నారు. గిద్దలూరు పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో ఆదివారం తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మండల టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.