గ్రేటర్‌లో రోజు రోజుకు పెరుగుతున్న విద్యుత్ కనెక్షన్లు..!
HYD: గ్రేటర్ HYDలో విద్యుత్ వినియోగం రోజు రోజుకు పెరుగుతోంది. నగర పరిధిలో మొత్తం 63 లక్షల విద్యుత్ కనెక్షన్లు ఉండగా, వాటిలో సుమారు 53 లక్షలు గృహ వినియోగానికి, 8 లక్షలు వాణిజ్య అవసరాలకు సంబంధించినవిగా అధికారులు తెలిపారు. నగర విస్తరణ, కొత్త కాలనీలు, అపార్ట్‌మెంట్లు పెరుగుతున్న నేపథ్యంలో ప్రతినెల సగటున 35 వేల కొత్త కనెక్షన్లు మంజూరు అవుతున్నాయి.