విద్యార్థులతో ఆత్మీయంగా మాట్లాడిన జిల్లా కలెక్టర్
BDK: జూలూరుపాడులోని కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయం (కేజీబీవీ)ను జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ సోమవారం సందర్శించారు. ఈ సందర్శనలో ఆయన విద్యార్థినులతో ఆత్మీయంగా మాట్లాడి, వారి విద్యా స్థాయి, వసతి, భోజనం, రోజువారీ జీవన విధానం గురించి వివరాలు తెలుసుకున్నారు. అలాగే పాఠశాలలోని సదుపాయాలు పరిశీలించారు.