నేడు పదో తరగతి హాల్ టికెట్లు విడుదల
TG: పదో తరగతి పరీక్షల హాల్ టికెట్లను ఇవాళ విడుదల చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు. https://www.bse.telangana.gov.in/ సైట్ ఓపెన్ చేసి డౌన్‌లోడ్ చేసుకోవచ్చని చెప్పారు. 8096958096 నంబర్‌కు వాట్సాప్‌లో HI అని మెసేజ్ చేసినా హాల్ టికెట్ పొందవచ్చని తెలిపారు. ఈనెల 14 నుంచి APR 16 వరకు పరీక్షలు జరగనున్నాయి. 5.28 లక్షల మంది విద్యార్థులు ఎగ్జామ్స్ రాయనున్నారు.