వైరాలో పేదలకు అందని ప్రభుత్వ వైద్యం
KMM: వైరాలో పేదలకు సరైనా ప్రభుత్వ వైద్యం అందడం లేదని సీపీఎం డివిజన్ కార్యదర్శి భూక్యా వీరభద్రం అన్నారు. గురువారం సీపీఐ(ఎం) ఆద్వర్యంలో వైరా ఏరియా హాస్పిటల్‌ను సందర్శించి సమస్యలపై సర్వే నిర్వహించారు. నిధులు లేక ఆసుపత్రి అస్తవ్యస్తంగా తయారైందని, వంద పడకల హాస్పిటల్‌గా అఫ్ గ్రేడ్ చేసినా పేదలకు సరైన వైద్యం అందటం లేదని ఆరోపించారు.