స్కూల్లో పేలుడు.. ఉద్దేశపూర్వకంగా చేసిందే: FBI
అమెరికాలో హార్వర్డ్ మెడికల్ స్కూల్లో పేలుడు ఘటన తీవ్ర కలకలం సృష్టించింది. ఈ ఘటన ఉద్దేశపూర్వకంగా చేసిందేనని FBI తేల్చి చెప్పింది. ఈ పేలుడులో ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదని వెల్లడించింది. ఈ మేరకు ఘటనా స్థలం నుంచి పారిపోయిన ఇద్దరు దుండగుల సీసీటీవీ దృశ్యాలను పోలీసులు రిలీజ్ చేశారు. వారిని పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టారు.