బుద్ధవనాన్ని సందర్శించిన విదేశి ప్రతినిధులు

బుద్ధవనాన్ని సందర్శించిన విదేశి ప్రతినిధులు
NLG: హైదరాబాద్‌లో ప్రారంభమైన గ్లోబల్ సమిట్ కార్యక్రమానికి విచ్చేసిన విదేశాలకు చెందిన ప్రతినిధులు సోమవారం నాగర్జునసాగర్‌లోని బుద్ధవనాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ప్రముఖ పరిశోధకుడు శివనాగిరెడ్డి వారికి బుద్ధవనం గురించి వివరించారు. అనంతరం వారు నాగార్జున సాగర్ జలాశయంలో పర్యాటక సంస్థకు చెందిన లాంచీలో గంటన్నరసేపు విహరించారు.