టీచర్ల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా: MLA

టీచర్ల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా: MLA

NLR: కందుకూరు UTF కార్యాలయంలో ఆదివారం జరిగిన కౌన్సిల్ సమావేశానికి ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా యూటీఎఫ్ బాధ్యులు ఎమ్మెల్యేను ఘనంగా సత్కరించారు. ఉపాధ్యాయుల న్యాయమైన కోరికలు, సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. జఠిల సమస్యలపై విద్యాశాఖ మంత్రి లోకేశ్‌తో చర్చించనున్నట్లు తెలిపారు.