'ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి'

KNR: సెట్విన్ శిక్షణ కేంద్రం ద్వారా విద్యార్థులు ఉచిత కోర్సులు నేర్చుకోవచ్చని సెట్విన్ TTI తెలంగాణ ప్రభుత్వ కో-ఆర్డినేటర్ సయ్యద్ మొయిజుద్దీన్ తెలిపారు. విద్యార్థులకు DCA, PGDCA, ట్యాలీ, ఫ్యాషన్ డిజైనింగ్, బ్యూటీషియన్, మగ్గం వర్క్, మొహిందీ తదితర కోర్సుల్లో ఉచిత స్టడీ మెటీరియల్స్ కల్పిస్తామన్నారు. కోర్సు అనంతరం సర్టిఫికెట్లు అందజేస్తామని స్పష్టం చేశారు.