రోడ్డు పనులు పూర్తి చేయాలని నిరసన

వరంగల్: నెక్కొండ మండలం అలంకానిపేట గ్రామం నుండి చిన్నకార్పోల్ గ్రామం వరకు బీటి రోడ్డు పనులను ప్రభుత్వం పూర్తిచేయాలని బీఆర్ ఎస్ పార్టీ ఆధ్వర్యంలో గ్రామస్తులు నాయకులు నిరసన తెలిపారు. నూతన బిటి రోడ్డు నిర్మాణానికి గత బీఆర్ఎస్ ప్రభుత్వం 16 కోట్ల నిధులను మంజూరు చేసిందని కాంగ్రెస్ ప్రభుత్వం టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి పనులను చేపట్టాలని వారు డిమాండ్ చేశారు.