ఘనంగా హోలీ సంబరాలు
KNR: జమ్మికుంట పట్టణంలోని డిగ్రీ కళాశాల మైదానంలో 'బ్రదర్స్ టీం' ఆధ్వర్యంలో 'బిగ్గెస్ట్ హోలీ ఈవెంట్' అత్యంత వైభవంగా జరిగింది. మునుపెన్నడూ లేని విధంగా ఏర్పాటు చేసిన రెయిన్ డాన్స్, టాప్ డీజే మ్యూజిక్ పండుగకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. మండుతున్న ఎండలో చల్లని చినుకుల మధ్య యువత రంగులు చల్లుకుంటూ, అదిరిపోయే పాటలకు స్టెప్పులేస్తూ ఉత్సాహంగా గడిపారు.