జోరుగా సాగుతున్న మట్టి అక్రమ త్రవ్వకాలు

జోరుగా సాగుతున్న మట్టి అక్రమ త్రవ్వకాలు

VZM: వేపాడ మండలంలో మట్టి అక్రమ త్రవ్వకాలు జోరుగా సాగుతున్నాయి. సింగరాయిలో కోమటి చెరువు, ఊర చెరువు కొంపల్లిలో రాజుల చెరువు, వేపాడలో తోము చెరువు తదితర ప్రాంతాల్లో రాత్రి వేళల్లో మట్టి త్రవ్వకాలు చేపడుతూ, సొమ్ము చేసుకుంటున్నారని స్థానికులు అంటున్నారు. ఇంత జరుగుతున్నా రెవెన్యూ అధికారుల్లో స్పందన లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. అధికారులు స్పందించి మట్టి అక్రమ త్రవ్వకాలకు అడ్డుకట్ట వేయాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.