VIDEO: పల్టీలు కొట్టిన కారు.. తప్పిన పెనుప్రమాదం
TPT: చంద్రగిరి మండలం అగరాల జాతీయ రహదారిపై ఆదివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అదుపు తప్పిన కారు కల్వర్టును ఢీకొని పల్టీలు కొట్టింది. కారులో ఉన్న ఆరుగురు అయ్యప్ప భక్తులు గాయపడ్డారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. శబరిమలై దర్శనం చేసుకుని స్వగ్రామం కోడూరుకు వెళ్తుండగా ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు.