108 వాహనంలో డెలివరీ.. తల్లి బిడ్డ క్షేమం

108 వాహనంలో డెలివరీ.. తల్లి బిడ్డ క్షేమం

PPM: సీతంపేట మండలం సిలగాం గ్రామానికి చెందిన సవర శాంతి(36) 4వ కానుపు పురిటి నొప్పుతో బాధపడుతూ, 108 అంబులెన్సుకి శనివారం సమాచారం అందించారు. పరిస్థితి విషమించడంతో EMT ఎల్.రాము, పైలట్ D.గోవిందరావు సమయస్ఫూర్తితో అంబులెన్సులోనే ప్రసవం చేశారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం తల్లి బిడ్డను సీతంపేటలో ఆస్పత్రికి తరలించారు. దీంతో సదరు కుటుంబం సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపింది.