'మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి'

కృష్ణా: స్వర్ణాంధ్ర, వికసిత్ భారత్ దిశగా చేస్తున్న ప్రయాణంలో మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదగాల్సిన అవసరముందని జిల్లా కలెక్టర్ లక్ష్మీశ అన్నారు. బుధవారం కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన ఇగ్నైట్ సెల్‌ను సందర్శించారు. ప్రతి ఇంటి నుంచి ఒక పారిశ్రామికవేత్త తయారుకావాలనేది లక్ష్యమని అన్నారు.